ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నట్లు సమాచారం అందుతోంది.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా… సెప్టెంబర్ 7వ తేదీ అంటే ఆ వచ్చే నెల నుంచి… ఏపీలో వైన్స్ బంద్ చేయాలని…ఏపీ బేవా రేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు… కీలక ప్రకటన చేయడం జరిగింది.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు లేకుండా రాశారు ఈ కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిందని… కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం పోయే పరిస్థితి నెలకొందని ఆ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొత్త మద్యం పాలసీ వస్తే…ఏపీలో ఉన్న 15వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని.. లేఖలో స్పష్టంగా వివరించారు.
దీనిపై న్యాయపరమైన నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని పిలుపునిచ్చారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా అక్టోబర్ నెల నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించింది.