వరకట్నం వేధింపులు అనేవి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంత మంది వరకట్నం ఇచ్చినా సరే ఎక్కువగా డిమాండ్ చేస్తూ వేధిస్తూ ఉంటారు. అలా వేధించే వ్యక్తికి కృష్ణా జిల్లా నూజివీడు కోర్ట్ షాక్ ఇచ్చింది. అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు శిక్షను నూజివీడు కోర్టు విధించింది.
చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామం 2013లో వరకట్న వేదింపులలో ఆరెల్లి శ్రీదేవిని ఆమె భర్త హత్య చేసాడు. అదనపు కట్నం కోసం అల్లుడే హత్య చేసాడని నూజివీడు పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు చేసారు. న్యాయస్థానంలో కేసుని సుదీర్ఘంగా విచారించి… ముద్దాయి రాంబాబుకు ఐపిసి సెక్షన్ 302 గాను యావజ్జివ కఠిన కారాగార శిక్షను విధించారు 15వ అదనపు జిల్లా జడ్జి భారతి. కోర్ట్ తీర్పుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసారు.