పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ ఇది మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచెనా వేస్తోంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేయనున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెల్లకూడదని హెచ్చరించారు. సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్ప పీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతుంది. దీని కదలికలను అంచనా వేయడం కష్టతరమవుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.