కర్నూలు కాల భైరవస్వామి విగ్రహ ధ్వంసం కేసు.. పిల్లల కోసమేనట !

-

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు శ్రీ కాల భైరవ స్వామి విగ్రహ ధ్వంసం చేసిన నిందితుడి పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడు గోస్పాడు మండలం ఒంట వెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లి రాజశేఖర్ గా గుర్తించారు. ఈరోజు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సమక్షంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల 19 వ తేది కాల బైరవ స్వామి ఆలయం తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి పూజలు చేశాడు రాజశేఖర్.

అనంతరం కాలబైరవ స్వామి అంగాన్ని ధ్వంసం చేసి అంగ భాగంలో కొంత ఎత్తు కెళ్లాడు. పూజకు వాడిన పూల మాల, బైక్ ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. కాలభైరవ స్వామి విగ్రహ అంగానికి పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో రాజశేఖర్ అంగాన్ని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్లి రోజూ పూజలు నిర్వహిస్తున్నాడని గుర్తించారు. నిందితుడికి కొంతకాల క్రితం పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదు అందుకే కాలభైరవ స్వామి విగ్రహ అంగానికి పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో రాజశేఖర్ అంగాన్ని చోరీ చేసినట్టు గుర్తించారు. నిందితుడు రాజశేఖర్ సాధారణ వ్యక్తేనని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ ఫక్కిరప్ప పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version