సోకాల్డ్ రాజకీయ పార్టీలందు కమ్యునిస్టు పార్టీలు వేరయా అనేది పాతమాట… నాటి కమ్యునిస్టులందు నేటి కమ్యునిస్టులు మరీ వేరయా అనేది కొత్త మాట! మహా మహా నిజాయితీపరులైన, ప్రజాపక్షపాతులైన, నిస్వార్ధపరులైన కమ్యూనిస్ట్ లను అందించిన ఈ నేల.. “ఎర్రనీడలో పసుపు రాజకీయాలు చేసే కమ్యూనిస్టులు”ను కూడా అందించింది!
ఇది వరకు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలని, ఆక్రమణలు వద్దు అని, ప్రభుత్వ భూములు కాపాడాలని.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఆందోళన చేసేవారు కమ్యునిస్టులు! అయితే… అది గతం! ఇప్పుడు తాజాగా “గీతం” విషయంలో సీపీఐ నేతలు స్పందించిన విధానం చూసిన వారికి.. పార్టీ సిద్ధాంతాలకు, పునాదులకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అని అనిపించకమానదు!
సరిగ్గా గమనిస్తే… కమ్యూనిస్టులు గతకొంతకాలంగా ఎరజెండా బదులు పచ్చ జెండా మోస్తున్న పరిస్థితి! రాజకీయంగా స్థిరమైన అభిప్రాయం కొరవడుతున్న పరిస్థితి! చంద్రబాబుకు నీడలా, డూపులా ప్రవర్తిస్తున్న పరిస్థితి! ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు.. రాజకీయాల్లో ఆటలో అరటిపండ్లు, సమాజం దృష్టిలో చులకన అయిపోతున్నారు! ఫలితంగా వారిని అభిమానించేవారిని మనోవేదనకు గురిచేస్తున్నారు!
ఇక్కడ కమ్యునిస్టులకు రాజాకీయాల్లో పూర్వ వైభవం.. సమాజంలో గౌరవం, పేదవాడి మదిలో షైర్యం, మేధావుల ఆలోచనల్లో నమ్మకం కలిగించాలంటే… పార్టీలోకి వచ్చిన కొత్తలో, ఎర్ర జెండా చేతపట్టిన తొలినాళ్లలో నమ్ముకున్న సిద్ధాంతాలకు, నేర్చుకున్న పాఠాలకు అనుగుణంగా నడుచుకోవడం! దానితోపాటు చంద్రబాబు కౌగిలి నుంచి బయటకు వచ్చి.. ప్రజల కౌగిలిలో చేరే ప్రయత్నం చేయడం!! ఇది కమ్యునిస్టులకు “మనలోకం.కాం” చేస్తున్న సూచనలు!