ఇవాళ ఏపీ కేబినేట్ మీటింగ్ జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినేట్ భేటీ నిర్వహించనున్నారు. అమరావతిలో 20 వేల కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులపై ఏపీ కేబినేట్ లో చర్చ జరుగనుంది. ఇప్పటికే సిఆర్డియో అధారిటీ అమోదించిన పలు ప్రాజెక్ట్ ల అమోదం కోసం ఏపీ కేబినేట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి.
ఇక ఇవాళ్టి కేబినేట్ మీటింగ్ లో మంత్రులకు మార్కులు, ర్యాంక్ లు ఇచ్చే అవకాశం ఉందట. సీఎం గుడ్ లుక్స్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ కొండపల్లి శ్రీనివాస్, లోకేష్ ఉన్నారట. కొంతమంది మంత్రులపై అసంతృప్తి ఉన్నారట బాబు. ఇవాళ కేబినెట్ భేటీ లో తెలిపే అవకాశం ఉంది. ఆరు నెలలు ముగియడంతో మరింత సీరియస్ గా శాఖలపై దృష్టి పెట్టాలని మంత్రులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.