విశాఖలో భారీ చోరీలు.. 48 గంటల్లో 3 ఏటీఎంలను కొల్లగొట్టేశారు..!

-

ఈ మధ్య కాలంలో రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా దొంగతనాలు జరిగింది ఒక ఎత్తయితే.. విశాఖలో జరిగిన చోరీలు మరో ఎత్తు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటీఎంలను అంతరాష్ట్ర ముఠాలు కొల్లగొట్టాయి. 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఎంలను దోచేశారు ఆగంతకులు. సుమారు 50 లక్షల రూపాయలు చోరీ అవ్వగా.. దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి మునగపాకలోని ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొడితే.. ఇవాళ విశాఖ నగర పరిధిలో రెండు చోరీలు జరిగాయి.

పెందుర్తి నటరాజ్ థియేటర్ పక్కనే ఉన్న ఏటీఎంలో సీసీ కెమెరాలకు బ్లాక్ పెయింట్ వేసి మరి దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం పూర్తిగా ధ్వంసం చేసి సుమారు 19 లక్షలు ఎత్తుకెళ్లారు. భీమిలి పరిధిలోని తగరపువలస జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏటీఎంలో లూటీ చేశారు అంతరాష్ట్ర నేరగాళ్లు. ఇక్కడ సుమారు 15 లక్షలు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ మూడు చోరీలు ఒకే బ్యాంకుకు సంబంధించినవి కాగా.. నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న ఏటీఎంలో టార్గెట్ చేయడం అటు బ్యాంకు వర్గాలను, ఇటు పోలీసులను పరుగులు పెట్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news