Meeting of AP and Telangana officials today: నేడు ఏపీ, తెలంగాణ అధికారులు భేటీ కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది.
రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో.. ఏపీలోని మంగళగిరి A P I I C కార్యాలయంలో జరిగే ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పై చర్చించనున్నారు. ఇక అటు నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ వద్ద HCCB కోకా కోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి.