స్థానికులకు రేపు తిరుమల శ్రీవారి దర్శనం – TTD చైర్మన్

-

స్థానికులకు రేపు తిరుమల శ్రీవారి దర్శనం ఉంటుందని TTD చైర్మన్ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. రేపటి దర్శనానికి టోకెన్స్ జారి చేసింది టిటిడి. ఈ టోకెన్లు జారిని మహతి ఆడిటోరియం వద్ధ ప్రారంభించారు TTD చైర్మన్ బీఆర్‌ నాయుడు. ఈ సందర్భంగా TTD చైర్మన్ బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ… గత నెల 18వతేది స్థానికులకు శ్రీవారి దర్శనం పునరద్దరిస్తూ నిర్ణయం తీసుకున్నామని… టిటిడి నిర్ణయాన్ని సిఎం చంద్రబాబు నాయుడు కు వివరించానని తెలిపారు.

br naidu

సిఎం సూచనల మేరకు తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించామని.. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి స్థానికులు ధన్యవాదాలు తెలపాలని వివరించారు. అటు ఈవో శ్యామల రావు మాట్లాడుతూ… స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ జరిగిన ఈ రోజు శుభదినం అన్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుందని వివరించారు. రెండు రోజుల ముందు స్థానికులకు టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలో కమ్యూనిటీ హాల్ లో టోకెన్లు జారీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news