ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు ఉండనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో.. చలి చంపేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి ముందు విపరీతంగా చలి పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఉంటాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని.. పేర్కొంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర అలాగే యానంలో… పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం ప్రారంభమైంది.