మహా కుంభమేళాకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం మహా కుంభమేళాకు మంత్రి నారా లోకేశ్ దంపతులు వెళుతున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని షాహి స్నానఘట్టానికి చేరుకోనున్నారు నారా లోకేశ్. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ప్రయాగ్‍రాజ్ నుంచి వారణాసికి పయనం అవుతారు.

అనంతరం ఇవాళ మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసిలోని కాలభైరవ ఆలయ సందర్శన ఉంటుంది. ఇక ఇవాళ సాయంత్రం 3.40 గంటలకు వారణాసి కాశీవిశ్వేశ్వర ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఇవాళ సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం చేస్తారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ దంపతులు.