పెద్దగట్టు జాతరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్దగట్టు జాతరకు రూ.5 కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం దురాజ్ పల్లి… పెద్దగట్టు జాతర లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..అనంతరం మాట్లాడారు. లింగమంతుల జాతరకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మంత్రి ఉత్తమ్..తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఏపీకి నీటిని తరలిస్తున్నారన్న హరీశ్ రావు వ్యాఖ్యలు అర్ధరహితం అని వివరించారు.
పెద్దగట్టు జాతరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి పెద్దగట్టు జాతరకు రూ.5 కోట్లు కేటాయించారు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి pic.twitter.com/sTVMkqvtaY
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025