ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ కు అరుదైన ఘనత

-

ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ కు అరుదైన ఘనత దక్కింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ్యులంతా కేసీఆర్ గారి దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృక్షార్చనతో అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.

సిడ్నీలో రాజేష్ రాపోలు మాట్లాడుతూ, “అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన గౌరవనీయులైన కేసీఆర్ గారు దీర్ఘాయుష్యంతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

రవీందర్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యులంతా వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో చంద్రమౌళి, అరుణ్ మస్నా, యాదమ్మ, నవ్య, విద్య, సంగీత దుపాటి, రబియా బేగం, మధు రావు, అజాజ్ మొహమ్మద్, ఇమాముద్దీన్, సృజన్ వంకాయల, మాధవ్ గుడుకుంట్ల, అవినాష్ అడ్లూరి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news