విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీల పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రశ్నలు కూడా సంధించారు. జగన్ మోహన్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కౌంటర్ ఇస్తూ… విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడే కనీస అర్హత నీకు ఉందా? అంటూ నిలదీశారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని నీకు అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది నువ్వు కాదా? అన్నారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా? అని ఆగ్రహించారు.
విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏపీ జెన్కోని నాశనం చేసింది నువ్వు కాదా ? పీపీఏలను రద్దు చేయండి, ఉత్పత్తిదారులను భయపెట్టడంతో కేంద్ర, విదేశీ బ్యాంకుల వద్ద రాష్ట్రం పరువు తీసింది నువ్వు కాదా? అంటూ మండిపడ్డారు. 2022-23, 23-24 ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చింది నువ్వు కాదా జగన్? డిస్కంలు విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ అనుమతి కోరింది నీ హయాంలో కాదా? అని ప్రశ్నించారు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగిన జగన్ మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు పాలనను విమర్శించేది? నువ్వు చేసిన తప్పిదాలతోనే కదా అనవసరంగా హిందూజా పవర్ కు రూ.1200 కోట్లు కట్టాల్సి వచ్చింది? అని ఆగ్రహించారు. నీ హయంలో ప్రతీ వ్యవస్థ నాశనం అయ్యింది నిజం కాదా? అని ప్రశ్నించారు.