Minister Kandula Durgesh : టికెట్ ధరలు పెంచితే…మాకు రూపాయి రాదు అన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. టికెట్ ధర ఒక్క రూపాయి పెంచితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పావలా మాత్రమేనని వెల్లడించారు. తాజగా సినిమా టికెట్ల రేట్లపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచమని నిర్మాతలు అడుగుతున్నారన్నారు.

టికెట్ ధర ఒక్క రూపాయి పెంచితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పావలా మాత్రమేనని చెప్పారు. టికెట్ ధరల పెంపు హోం శాఖ పరిధిలో ఉంటాయని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలపై ఆధారపడి వందలాది కుటుంబాలు ఉన్నాయని వివరించారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. టికెట్ రేటు పెంచితే వారికి ఉపయోగపడుతుందన్నారు కందుల దుర్గేష్.