వై.వి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలి : నారా లోకేష్

-

శ్రీవారి లడ్డూపై తీవ్రంగా స్పందించారు మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై మేము స్పష్టమైన ఆరోపణలు చేశాం. వైసీపీ ప్రభుత్వంలో భక్తులను దేవుడికి దూరం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని సర్వనాశనం అవుతారని అప్పుడే చెప్పాం. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి అని లోకేష్ చెప్పారు.

అయితే నెయ్యిని ఎన్.డి.డి.ఎఫ్ కు పంపిస్తే జంతువుల క్రొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనె ఉందని నిర్ధారించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం. కానీ జగన్ లాంటి సీఎంను చూడలేదు. తిరుమల శ్రీవారి పవిత్రతను మేము కాపాడుతాం. కొత్తగా వచ్చిన ఇఓ లడ్డు నాణ్యతను పెంచారు. కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టం. అవసరమైతే వారు తీసుకున్న కమిషన్లను రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తాం. ఈ విషయంలో నేను వై.వి.సుబ్బారెడ్డి కి సవాల్ విసురుతున్నా… దమ్ముంటే వై.వి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలి అని పేర్కొన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version