రేపు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి వెళ్లనున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 18 విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు జారీ అయ్యాయి. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరవుతానని తెలిపారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.

ఇదే కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి SIT నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18న విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు SIT అధికారులు.