చేనేతలకు లోకేష్‌ శుభవార్త..పద్మశాలి భవన్ కు శంకుస్థాపన

-

చేనేతలకు లోకేష్‌ శుభవార్త..కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి-విజయవాడ బైపాస్ లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(PIWA) ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన చేశారు.

Minister Nara Lokesh laid the foundation stone of Padmasali Bhavan in Kolanukonda

పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కు పీఐడబ్ల్యూఏ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. 17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోంది.

పేద విద్యార్థులు, చేనేత కుటుంబాలకు దాదాపు మూడు కోట్లకు పైగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటుచేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్దఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version