రెండో భార్య కాపురానికి వస్తలేదని.. మొదటి భార్య పిల్లలతో కలిసి భర్త సూసైడ్

-

సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ వ్యక్తి తన రెండో భార్య కాపురానికి రావడం లేదని తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. అతనికి గత కొన్నాళ్ల కిందట రెండో వివాహం జరిగినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో రెండో భార్య తన పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని సమాచారం.

ఈ క్రమంలోనే తన భార్యను ఇంటికి రావాలని పలుమార్లు కోరిన భర్త..తను ఎంతకూ రాకపోయేసరికి తీవ్ర మసస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో తన మొదటి భార్య పిల్లలను తీసుకుని చింతల చెరువులో దూకి తండ్రి సత్యం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version