ఇరిగేషన్ శాఖ లో పలు ప్రాజెక్టులపై, ప్రధానంగా పోలవరం పై సీఎం రివ్యూ నిర్వహించారు. పోలవరాన్ని యజ్ఞం లాగా పునర్నిర్మాణం చేయాలని చర్చించాం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈనెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన చేస్తారు. ఇందులో పోలవరం నిర్మాణం షెడ్యూల్ ను సీఎం ప్రకటిస్తారు. ఈసీఆర్ఎఫ్ ఎలా పూర్తి చేస్తాం ఎప్పుడు పూర్తి చేస్తాం అనే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచీ అనుకున్న సమయానికి పోలవరం పూర్తవ్వాలని సీఎం ఆదేశించారు.
అయితే గత పాలనలో డయాఫ్రం వాల్ పూర్తిగా విధ్వంసం అయింది. మెయిన్ డ్యాం ప్రాంతంలో భారీ గుంతలు పడ్డాయి. భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడేవి అన్నీ పాడైపోయాయి. 2025లో పోలవరం పనులు పూర్తిస్ధాయిలో జరుగుతాయి. టెక్నికల్ అనుమతులు కూడా సూత్రప్రాయంగా వచ్చాయి. డయాఫ్రం వాల్ కు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికి సూత్రప్రాయంగా ఇంజనీర్లు అంగీకరించారు. చంద్రబాబు ప్రకటించిన దగ్గర నుంచీ సమయం వృధా చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. డిసెంబరులోనే పోలవరం గ్రౌండ్ వర్కులు పూర్తి చేస్తాం అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.