2014-19లో వైజాగ్ లో 4325 ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల పై 2019 లో కేసులు నమోదయ్యాయి. 2019-24 మధ్య 17 మెడికల్ కాలేజీలు మేం తెచ్చాం. ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేయాలనుకోవడం స్కామ్ అని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. మీ 40 ఏళ్ల చరిత్రలో ఒక్క పోర్టు అయినా కట్టారా. కాకినాడ పోర్టును ప్రైవేట్ అప్పగించింది ఎవరో అందరికీ తెలుసు. ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వ పెత్తనమేంటి.
అగ్రిగోల్డ్ కంపెనీ ప్రజలను దోచుకుని పోతే 2019-24 లో మేం న్యాయం చేశాం. 7.5 రూపాయల విద్యుత్ ను 2.5కి కొనుగోలు చేయడం స్కామ్ అవుతుందా. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని స్వయంగా చెప్పారు. అమరావతిని తెచ్చిన మీకు కృష్ణా,గుంటూరు జిల్లాల్లో 2019లో ఎన్ని సీట్లు వచ్చాయ్. 2019-24 మధ్య టూరిజానికి ఎలాంటి ఇబ్పంది కలగలేదు. 2019-24 మధ్య 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీలుకురావడం స్కామ్ అవుతుందా. 2019-24 లో డ్రగ్స్ వచ్చేశాయని ఆరోపణలు చేశారు. వైజాగ్ పోర్టులో పట్టుబడిన షిప్ కు ఈ ప్రభుత్వం ఎలా క్లీన్ చిట్ ఇచ్చింది అని ప్రశ్నించారు తూమాటి మాధవరావు.