ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని ప్రకటించారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ…. ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాoటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని… ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం త్వర లో చేపడతామని హామీ ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందిందన్నారు. 2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబల్ డిజిట్ కు పడిపోయునా వైసీపీకి బుద్ది రాలేదని చురకలు అంటించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ఫించన్, ఇసుక, తల్లికి వందనం వంటి పథకాలపై విష ప్రచారం మొదలుపెట్టిన వైసీపీకి ఈసారి సింగిల్ డిజిట్టే అని చురకలు అంటించారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు.