నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. కూకట్ పల్లి జేఎన్టీయూ లో క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యూకేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హారజైన   సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగం పై దృష్టి పెట్టిన రాష్ట్రాలు ఆర్తికంగా బాగున్నాయి. విద్యార్థులకు పట్టాలున్నాయి. కానీ పనితనం లేదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

చిన్న సమస్య రాకుండా గ్రూపు 1 పరీక్స నిర్వహించాం. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి పోయే నష్టం ఏమి లేదు. కానీ విద్యార్థులు నష్టం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశ పెడుతామని తెలిపారు.  మార్చి 31 లోపు నిరుద్యోగుల ఖాళీలను  తయారు చేసి జూన్ 02న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రైవేట్ కళాశాలకు రూపాయి కూడా పెండింగ్ లేకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news