ఏపీ ప్రజలకు శుభవార్త..టిడ్కో ఇళ్లపై కీలక ప్రకటన

-

ఏపీ ప్రజలకు శుభవార్త..టిడ్కో ఇళ్లపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. శాస‌న‌మండ‌లిలో టిడ్కో ఇళ్ల‌పై స‌మాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయ‌ణ‌… గ‌త ప్ర‌భుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం 5 ల‌క్ష‌ల ఇళ్ల‌కు అడ్మినిస్ట్రేటివ్ అనుమ‌తులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని ఆగ్రహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో హైటెక్నాల‌జీ,హై క్వాలిటీతో ఇళ్ల నిర్మాణం చేప‌ట్టామన్నారు.

Minister Ponguru Narayana made an important announcement on TIDCO houses

గ‌త ప్ర‌భుత్వం పై మాపై క‌క్ష‌తో ల‌బ్దిదారుల ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించిందని పేర్కొన్నారు. ఇళ్లు ఇవ్వ‌ని వారి పేరు మీద కూడా బ్యాంకు లోన్ లు తీసుకోవ‌డంతో ల‌బ్దిదారులు ఇబ్బందులు ప‌డుతున్నారని వెల్లడించారు. ల‌బ్దిదారుల‌కు తిరిగి చెల్లించాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో మున్సిప‌ల్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారని… కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు పెండింగ్ లో పెట్టేసిందని ఫైర్ అయ్యారు. టిడ్కో ఇళ్ల‌కు రంగులు మార్చ‌డం కోసం ఏకంగా 300 కోట్లు ఖ‌ర్చు పెట్టిందని నిప్పులు చెరిగారు. టిడ్కో ఇళ్ల‌కు మౌళిక‌వ‌స‌తులు క‌ల్ప‌న కోసం 5200 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేసామని… త్వ‌ర‌లోనే ల‌బ్దిదారుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా ముందుకెళ్తున్నామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version