ఏపీలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ డెయిరీలో పలు అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం ఇదే విషయాన్ని పలు మార్లు ప్రస్తావించడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విశాఖ డెయిరీపై ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ సమయంలో ఆసక్తికర చర్చ జరిగింది.
విశాఖ డెయిరీలో అవినీతి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూనే..డెయిరీలో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపడానికి ప్రత్యేక సభా సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు.సభ అభిప్రాయం తీసుకుని సభా సంఘం నియమించాలని స్పీకర్‌ను మంత్రి కోరారు. సభా సంఘం నియామకంపై కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు.కాగా, దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.