వృద్ధాప్య పెన్షన్ కు రోజా ధరఖాస్తు చేసుకోవాలి – ఏపీ మంత్రి

-

వృద్ధాప్య పెన్షన్ కు రోజా ధరఖాస్తు చేసుకోవాలంటూ చురకలు అంటించారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఫిలిం ఛాంబర్ లో వృద్ధాప్య పెన్షన్ కు రోజా ధరఖాస్తు చేసుకోవాలని… రోజా దరఖాస్తు చేసుకున్న వెంటనే వృద్థాప్య పెన్షన్ ఇస్తామని సెటైర్లు పేల్చారు. మంత్రిగా ప్రజాధనాన్ని దోచేసిన రోజా పక్క రాష్ట్రాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోందని ఆగ్రహించారు.

Minister Ramprasad Reddy on roja

నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లో ఆ స్థాయిలో రాణిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. తాము చేసిన శాఖల గురించి అవగాహన లేని మాజీ మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ను విమర్సిస్తుండడం విడ్డూరంగా ఉందని వివరించారు. మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసుపై విచారణ జరుగుతోందన్నారు. ప్రజాధనం దోచేసిన మాజీ మంత్రుల అవినీతిపై విచారణ జరుగుతోంది…మాజీ మంత్రులందరూ జైలుకెళ్ళడం ఖాయం అని హెచ్చరించారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news