జగన్ పాలనపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

-

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు ఇంటి వద్దే ఉచితంగా అందుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనసర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం పూత్తూరు మున్సిపాలిటీ అంబేద్కర్ సచివాలయం పరిధిలోని 15, 25, 26 వ వార్డ్ లో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జగనన్న సురక్షలో నమోదు చేసుకొన్న 727 సర్టిఫికేట్లు ఆమె అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటా ఇబ్బందులు, కష్టాలు లేకుండా నేడు 276 మందికి ఆదాయ సర్టిఫికేట్లు, 201మందికి ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్లు, 132 మందికి రెల్స్యాన్స్ ఆదాయసర్టిఫికేట్, 117 మందికి రెల్స్యాన్స్ ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్లు ఒకరికి హౌస్‌హోల్డ్‌ విభజన జరిగిందంటే అందుకు జగనన్న ప్రవేశపెట్టి సురక్ష పథకమే కారణమన్నారు. 11 రకాల సర్టిఫికేట్లు అందించడంతో పాటు పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.

సచివాలయపరిధిలోని వార్డుల్లో సంక్షేమం రూ.12.20కోట్లు, అభివృద్దికి పూర్తిచేసిన పనులు రూ.73.84లక్షలు, టెండర్స్ కంప్లీట్ అయిన పనులు రూ.51.20 లక్షలు 80 మందికి ఇల్లు అందించారు దాదాపుగా 1.44 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ఇదిగాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అంటూ ప్రజలకు లబ్ది చేకూరిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం త్వరలో గ్రామంలో నిర్వహిస్తామని ఇక్కడ తన దృష్ఠికి వచ్చిన సమస్యలను గడపగడపకు మన ప్రభుత్వం నిధుల ద్వారా నెరవేరుస్తామన్నారు. ఇవేమీ తెలియని టీడీపీ నాయకులు ఏం అభివృద్ధి జరిగిందని వాగుతున్నారని వారికి ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. కరోనా సమయంలో మన ప్రభుత్వం చేసినన్ని సేవలు దేశవ్యాప్తంగా ఎవరూ చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీలో మూడు వేలకు పైగా జబ్బులను చేర్చి మెరుగైన సేవలు చేస్తున్నామన్నారు. రెండుసార్లు ప్రజలు ఇచ్చిన ఆధరణతోనే నేడు మంత్రిగా ఉన్నానని ప్రజల పక్షాన నిలబడ్డ తనను ప్రజలు మూడో సారి కూడా తప్పక ఆదరిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news