ఏపీ ప్రజలకు శుభవార్త.. డయాలసిస్ యూనిట్లు ప్రారంభించారు మంత్రి సత్య కుమార్. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్. ఈ సందర్భంగా సత్య కుమార్ మాట్లాడుతూ… నెల్లూరు ఆసుపత్రికి ఆరు డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని… దేశంలో 3కోట్ల 40 లక్షల మంది మూత్ర పిండ వ్యాధి తో బాధ పడుతున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వానికి అండగా నిలవడం ఆనందంగా ఉందని… గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసిపి ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని ఆగ్రహించారు. సెక్యూరిటీ, శానిటైజేషన్ లో అవకతవకలకు పాల్పడ్డారని…నాసిరకం మద్యం తో ప్రజలు అనారోగ్యం పాలయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు.