జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని ఆగ్రహించారు. ఎక్కడో బస్సు కాలిస్తే బిజెపికి ఏం సంబంధం అని ఫైర్ అయ్యారు. బీజేపీ దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న పార్టీ అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
గతంలో ప్రభాకర్ రెడ్డి బస్సులపై , వ్యాపారాలపై,అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడనని తెలిపారు మంత్రి సత్య కుమార్ యాదవ్. కూటమిలో భాగస్వామి అయిన, బిజెపి గురించి ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు. వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చి, రాష్ట్ర సమస్యలాగా మాట్లాడకూడదన్నారు. అర్థంపర్థం లేని విమర్శలు ,బిజెపి మీద చేయడం సరికాదని ఆగ్రహించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.