సాయంత్రం కూడా భార్య ఇంట్లో పని ఎందుకు చేయాలి? అంటూ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు మంత్రి సీతక్క. భార్య భర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి? అని ప్రశ్నించారు. ఇంట్లో ఇల్లాలు చదువుకుంటే కుటుంబం, సమాజం బాగుపడుతుందని తెలిపారు.
సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయం అన్నారు సీతక్క.
ఇక అటు అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు నేనే మంత్రిగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా ప్రకటించారు సీతక్క. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు సీతక్క. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీతక్క.
ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతోంది: మంత్రి సీతక్క
భార్య భర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి?
ఇంట్లో ఇల్లాలు చదువుకుంటే కుటుంబం, సమాజం బాగుపడుతుంది
సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
సావిత్రి… pic.twitter.com/vLovcy48FL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025