నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ ఓనర్స్.. బెయిల్ పిటిషన్ దాఖలు..!

-

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ కేసులో ఏ1 గా ఉన్న పెద్ద రామిరెడ్డి, ఏ2గా ఉన్న చిన్న రామిరెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారి పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.

ఈ తరుణంలనే మరికొద్ది సేపట్లో పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించనుంది. డిసెంబర్ 04 పుష్ప-2 ప్రీమియర్స్ షో ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ రావడం.. తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. మధ్యంతర బెయిల్ రావడం ఇలా అంతా చక చకా జరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news