ఏపీ ఫలితాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఏపీలో ఓటమిదిశగా మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మంత్రులు రోజా, బుగ్గన, చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ ఫలితాల్లో వెనకబడ్డారు. మాజీ మంత్రి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.
ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉండటంతో మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం బోసిపోయింది. ఆ పరిసరాల్లో నేతలు, కార్యకర్తల జాడ కనిపించడం లేదు. ఊహించని ఫలితాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉండిపోయాయి. మరోవైపు పలు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఇంటి బాట పడుతున్నారు. తాడేపల్లిలోని నివాసంలో ఓఎస్డీతో కలిసి సీఎం జగన్ ఫలితాలు వీక్షిస్తున్నట్లు సమాచారం.