లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ సిట్ ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించింది. మిథున్ రెడ్డి నేరం చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి నాన్ క్యాడర్ ఐఏఎస్ గా ప్రమోషన్ ఇస్తామని ప్లాన్ అమలు చేయించారు. A-2 వాసుదేవరెడ్డి, A-3 సత్యప్రసాద్ లను నేరుగా ప్రభావితం చేశారు.

రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరేలా సూచనలు చేశారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కట్టు కథలతో చంద్రబాబు లిక్కర్ కేసును సృష్టించారని… ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేని కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వం మద్యం షాప్ లను నిర్వహిస్తే స్కామ్ జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. అటు కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు.