మిథున్ రెడ్డి అరెస్ట్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు పెద్దిరెడ్డి. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని తప్పుడు కేసులు పెట్టారు… ప్రతిపక్ష పార్టీలను అదుపులోకి తీసుకోవాలని చంద్రబాబు వెర్రి ఆలోచనలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ చర్యలు చంద్రబాబు రాజకీయ జీవితం మీదే మాయని మచ్చగా ఏర్పడుతుందన్నారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

కాగా, లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ సిట్ ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించింది. మిథున్ రెడ్డి నేరం చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి నాన్ క్యాడర్ ఐఏఎస్ గా ప్రమోషన్ ఇస్తామని ప్లాన్ అమలు చేయించారు. A-2 వాసుదేవరెడ్డి, A-3 సత్యప్రసాద్ లను నేరుగా ప్రభావితం చేశారు. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరేలా సూచనలు చేశారని పేర్కొన్నారు.