విజయసాయిరెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి. సొంత చిన్నాన్నను చంపి జైలుకెళ్ళిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని అన్నారు. రాజీనామా పేరుతో నిన్న రాత్రి నుంచి విజయసాయిరెడ్డి చేస్తున్న ఎత్తులు, పైయ్యేత్తులు, నక్కజిత్తులు చూస్తున్నామని విమర్శించారు.
కాంగ్రెస్, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై కక్షకట్టి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అని మండిపడ్డారు. తన కుమారుడికి, తనకు సూట్ కేస్ కంపెనీలు, అక్రమ ఆస్తులు ఉన్నాయని, మనీ లాండరింగ్ చేశామని ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి ఈడి, ఆర్వోసి, ఐటి లకు ఫిర్యాదు చేశాడని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఒత్తిడితో సాగిన విచారణ వల్ల తన కుమారుడు రెండు సంవత్సరాల పాటు నలిగిపోయాడని పేర్కొన్నారు.
విచారణ జరిపిన ఆ సంస్థలు మా ఆర్థిక పరిస్థితిని చూసి కేసులు క్లోజ్ చేశాయని తెలిపారు సోమిరెడ్డి. తమ ఊరు, విజయసాయిరెడ్డి ఊరు దగ్గరగా ఉంటాయని.. తాము తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్నామని తెలిపాడు. విజయసాయిరెడ్డి, ఆయన తండ్రి, పినతండ్రీ కలిసి వాళ్ళ చిన్నాన్నను హత్య చేసి జైలు పాలయ్యారని ఆరోపించారు.