ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అర్హుల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేక పోయినా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని… తల తాకట్టు పెట్టైనా పేద వాడికి అండగా ఉండాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందరికి రేపే ఇవ్వాలని అనుకున్నాం. గ్రామ సభల్లో వచ్చిన వివరాల ఆధారంగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నామన్నారు.

గ్రామ సభల్లో కావాలని కొంత మంది, కొన్ని పార్టీలు మనసులో పెట్టుకుని అనేక కుట్రలు పన్నారని ఫైర్ అయ్యారు. కొత్త అప్లికేషన్లు క్రోడీకరించేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వరి వేస్తే ఉరే అన్న పార్టీలు ఇప్పుడు రైతు కమిటీలు అని అంటున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరి పేద వారికి కూడా 606 మండలాల్లోని వారిని గుర్తిస్తామని తెలిపారు. మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు. పేద వాడికోసం పని చేసే ప్రభుత్వం మాదన్నారు. మంచిని చెడుగా చిత్రీకరించి ప్రజల్లో మరింత పలుచన కావొద్దని… అనర్హులకు పథకాలు వస్తే వాటిని గుర్తించి వెంటనే రద్దు చేస్తామని ప్రకటించారు.