తెలుసుకొని మాట్లాడు.. హరీశ్ రావు పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..!

-

హరీశ్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామని.. బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. 

గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం మూసి ప్రక్షాళన అవశ్యకతను గుర్తించి మూసి ప్రక్షాళన మొదలు పెట్టారని తెలిపారు. మూసి ప్రక్షాళన లో నిర్వాసితులకు న్యాయం చేసిన తరువాతనే మూసి ప్రక్షాళన ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీగానే మిగిలిపోయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version