ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ జాతీయ రహదారిలోని భారీ చోరీ చోటుచేసుకుంది. ఓబులాపురం మిట్ట సమీపంలో దాదాపు రూ.1.3కోట్ల విలువైన సెల్‌ఫోన్ కంటైనర్‌ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ చోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డు మీద ఉన్న కంటైనర్‌ను దోచుకెళ్లడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. సెల్ఫోన్ల లోడుతో ఓ కంటైనర్ ఈ నెల 11వ తేదీన హరియాణా నుంచి బెంగళూరుకు వెళ్తోంది. అయితే మార్గ మధ్యలోనే డ్రైవర్, అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ కంటైనర్‌ను రోడ్డు పక్కన ఆపారు. అనంతరం అందులో ఉన్న సెల్‌ఫోన్ లోడ్‌ను మరో కంటైనర్‌లోకి మార్చి.. మొదటి కంటైనర్‌ను అక్కడే వదిలేసి వెళ్లారు.
నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ యజమాని.. సెల్‌ఫోన్ లోడ్‌తో వెళ్లిన డ్రైవర్ అందుబాటులోకి రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. లారీని ట్రేస్ చేయగా అది కర్నూల్ జిల్లా డోన్ వద్ద ఉందని తెలిసింది. డోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న డోన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు హరియాణాకు ప్రత్యేక బృందాన్ని పంపారు.