Modakondamma Ammavari fair : నేటి నుంచి పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. అల్లూరి జిల్లాలో నేటి నుండి పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాలు ప్రారంభం కాబోతుంది. మూడు రోజుల పాటు పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాలు జరుగనున్నాయి.

ఈ తరుణంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఇతర రాష్ట్రాలు నుంచి లక్షల్లో రానున్నారు అమ్మవారి భక్తులు. ఈ జాతరకు భారీగా భక్తులు వస్తున్న తరుణంలో పాడేరు వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. జాతర సందర్భంగా పాడేరులో టిడిపి స్వాగత ఫ్లెక్సీలు వెలశాయి.