అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ : మిథున్ రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పార్లమెంట్ లో ఇవాళ చర్చలు జరిగాయి. టీడీపీ లోక్ సభ పక్ష నేత గల్లా జయదేవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. దీనికి వైసీపీ నేత మిథున్ రెడ్డి కౌంటర్ చేశారు.ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను వివరించారు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అవినీతి స్టేల ద్వారా తప్పించుకున్నాడని చెప్పుకొచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.


ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం పూర్తి ఆధారాలతో నిరూపితం అయిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పీఏకు ఐటీ నోటీసు ఇవ్వగా.. ఆయన విదేశాలకు పారిపోయారని సభలో తెలిపారు. ఈ కేసులో చేసిన అవినీతి సొమ్ము 80 షేల్ కంపెనీలకు మళ్లించినట్టు తేలిందని చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి. ఇది పూర్తిగా అవినీతి కేసు అని.. చంద్రబాబు ప్రమేయంపై ఆధారాలున్నాయని వివరించారు. మిథున్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇరు పక్షాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో స్పీకర్ జోక్యం చేసుకొని.. ఈ కేసుకి సంబంధించి విచారణ కోర్టులో ఉన్న సమయంలో సభలో చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బెయిల్ అంశం కోర్టు ముందు ఉందని.. విచారణ చేసి కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news