ప్రతి జిల్లాలో వైసీపీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. నేను ఎలాంటి పదవులు ఆశించనన్నారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను…సీఎం జగన్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరుతున్నానని వెల్లడించారు ముద్రగడ పద్మనాభం. ఉదయం కిర్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 మధ్య పార్టీలో చేరిక ఉంటుందని వివరించారు.
సీఎం జగన్ కు మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను…సంక్షేమ పథకాలు పేదవారికి అందడానికి నా వంతు గా పార్టీలో చేరుతున్నానని చెప్పారు ముద్రగడ పద్మనాభం. ఎటువంటి కండిషన్ లేకుండా పార్టీలో చేరుతున్నాను…నాకు నా కుమారుడికి ఎటువంటి సీటు అడగలేదని చెప్పారు. దేవుడి దయ వల్ల జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏమైనా పదవి ఇస్తే తీసుకుంటాను… వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను…వైసీపీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటన చేశారు. నాకు నా కుటుంబానికి ఎలాంటి పదవి కాంక్ష లేదని పేర్కొన్నారు.