ముంబయి దేశానికి ఆర్థిక రాజధాని ఎలాగో.. ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని అలా అని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ సాగర తీరంలో నేవీ డే ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరై మాట్లాడారు. విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విశాఖ అంటేనే ప్రశాంతతకు మారు పేరు అని తెలిపారు. విశాఖను టెక్నాలజీ హబ్ గా తయారు చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. విశాఖకు త్వరలోనే మెట్రో రైలు వస్తుంది. అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2002 ఆగస్టులో మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం.
ప్రధాని వికసిత్ భారత్ లో భాగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేవిని చూస్తే.. వేరే వాళ్లు భయపడేవిధంగా మన నావి వాళ్లు పని చేస్తున్నారు. భారతదేశం వికసిత్ 2047 మిషన్ తయారు చేసిందో.. ఏపీ కూడా విజన్ 2047 తయారు చేసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు.