Naga Babu support for Jani Master: జానీ మాస్టర్‌కు మెగా బ్రదర్, జనసేన పార్టీ నేత నాగబాబు మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే.. మెగా బ్రదర్, జనసేన పార్టీ నేత నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో అందరూ దీనిపైనే ఫోకస్ చేశారు.
కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్టు పరిగణించకూడదు అంటూ నాగబాబు ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. అంటే జానీ మాస్టర్ ను ఇప్పుడు దోషి అనకూడదని అర్థం వచ్చేలా పరోక్షంగా నాగబాబు ట్వీట్ చేసినట్లు నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు…అలాంటి వాడిని పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు.