పవన్ కళ్యాణ్‌ కు 25 సీట్లు కూడా చంద్రబాబు ఇవ్వడం లేదు – వైసీపీ ఎమ్మెల్యే

-

రాబోయే ఎన్నికలలో జగన్ ఆశించిన విధంగా 175 అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం తథ్యమని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు.

చంద్రబాబు .. పవన్ కళ్యాణ్ లలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది తేల్చుకోలేకపోతున్నారు…దత్త పుత్రుడు 25 సీట్లు చాలంటున్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అవి కూడా ఇవ్వనంటున్నాడు…ఇదీ వీళ్ళిద్దరి మధ్య నడుస్తోందని చురకలు అంటించారు. ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ప్రజలు గుర్తొస్తున్నారు…ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ కావాలని ప్రజలందరూ ముక్తకంఠంగా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news