ఇంకెన్నాళ్లు దళితులపై ఈ దమనకాండ ముఖ్యమంత్రి గారు! – నారా లోకేష్

-

పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని జంజాల కృష్ణయ్య అనే ఓ దళితుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అంకాలమ్మ గూడూరు కి చెందిన జంజార కృష్ణయ్య ని అదే గ్రామానికి చెందిన ఉత్తమ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేశాడు. పాత పక్షులను మనసులో పెట్టుకుని దళితుడు కృష్ణయ్యను హత్య చేశారని.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డిఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. అయితే ఈ ఘటనపై తాజాగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

నా ద‌ళితులంటూ వేదిక‌ల‌పై నుంచి గొంతు చించుకునే ముఖ్య‌మంత్రి సొంత జిల్లా, నియోజ‌క‌వ‌ర్గంలోనే ద‌ళితుల ప్రాణాల‌కి ర‌క్ష‌ణ‌లేకుండా పోయిందన్నారు. ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది ద‌ళితుల్ని అంత‌మొందించడానికేన‌న్న‌ట్టు సాగుతోంది పాల‌న‌ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ద‌ళితుడైన కృష్ణయ్య హత్య ముమ్మాటికీ జ‌గ‌న్ స‌ర్కారు చేయించిన హ‌త్యేనని అన్నారు. సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత మ‌హిళ నాగ‌మ్మని అత్యంత దారుణంగా చంపేశారని.. ఇప్పుడు కృష్ణ‌య్య‌.. ఇంకెన్నాళ్లు ద‌ళితుల‌పై ఈ ద‌మ‌నకాండ ముఖ్య‌మంత్రి గారూ! అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version