ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ట్వీట్ చేశారు. మొదట అభ్యర్థులను, తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టారు. చివరికి దొంగ ఓట్లు సృష్టించి… 6,7 వ తరగతి చదివిన వాళ్లతో పట్టభద్రుల ఓట్లను వేయించారు.
కానీ డబ్బు బలం, అధికార బలం, అవినీతి బలం… ఏవీ కూడా ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. జగన్ మీదున్న అసంతృప్తిని చల్లార్చ లేకపోయాయని చురకలు అంటించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే దానర్థం… ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. 2024 ఎన్నికల్లో మార్పుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శ్రీకారం చుట్టాలని మేము ప్రజలని అడిగాం. వాళ్ళు తమ నిర్ణయాన్ని ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారని తెలిపారు నారా లోకేష్.