‘నాడు-నేడు’పై విచారణ చేపడతాం: అసెంబ్లీలో లోకేశ్‌

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నేడు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ చర్చిస్తున్నారు.

అనంతరం ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని చెప్పారు. మెగా డీఎస్సీ అందుకే వేశామని.. ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’పై ప్రభుత్వం విచారణ జరుపుతోందని వెల్లడించారు. గతంలో పనులు ఎందుకు సరిగా జరగలేదు, నాసిరకం పనులపై ఆరా తీస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version