లోకేష్ నూత‌న ఆలోచ‌న.. పెళ్లి చేసుకునే వారికి బ‌హుమ‌తులు

-

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నూత‌న ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టారు. మాఘ‌మాసంలో ఎక్కువ‌గా పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు జ‌రుగుతుండ‌డం.. అందులో ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌రు కావ‌డం కీల‌క నేత‌ల‌కు సాధ్యం కానీ విష‌యం. ఈ త‌రుణంలో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు చాలా మంది మాఘ‌మాసంలో జ‌రిగే శుభ‌కార్యాల‌కు హాజ‌రు కావాల‌ని త‌మ నాయ‌కుడు లోకేష్‌ను ఆహ్వానిస్తున్నారు.

అంద‌రి పెళ్లిళ్ల‌కు వెల్ల‌డం టీడీపీ నేత నారా లోకేస్ కు సాధ్య‌ప‌డ‌డం లేదు. దీంతో ఆయ‌న వినూత‌నంగా ఆలోచించి త‌న‌ను పెళ్లికి ఆహ్వానించిన వారికి ప్ర‌త్యేకంగా ఓ పెళ్లి కానుక‌ను పంపిస్తున్నారు. ఈ కానుక‌లో భాగంగా వ‌ధూవ‌రుల‌కు నూత‌న వ‌స్త్రాల‌ను అందిస్తున్నారు. వ‌రుడికి తెల్ల ప్యాంట్ ష‌ర్ట్‌, వ‌ధువుకు త‌లంబ్రాల చీర‌ను బ‌హుక‌రిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వివాహాలు చేసుకుంటున్న కార్య‌క‌ర్త‌లంద‌రికీ ఈ కానుక‌ను స్థానిక నేత‌లు వెళ్లి పెళ్లి మండ‌పంలోనే అందిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ ఓడిపోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు లోకేష్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version