మెగా డీఎస్సీ దస్త్రం పైనే నారా లోకేష్ తొలి సంతకం పెట్టారు. మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా తొలి సంతకం చేశారు నారా లోకేష్. మెగా డీఎస్సీ విధి విధానాలు రూపొందించి క్యాబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు లోకేష్. ఇక బాధ్యతలు స్వీకరణకు సచివాలయానికి వచ్చి ఆశ్చర్యపోయారు నారా లోకేష్. తన ఛాంబర్ సహా సెక్రటేరియట్ నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్టుకు వచ్చే వారా..? అని అధికారులను అడిగిన లోకేష్….మంత్రులు సెక్రటేరియట్టులో అందుబాటులో ఉండేవారు కాదని చెప్పారు అధికారులు. జగనే సెక్రటేరియట్టుకు రానప్పుడు ఆయన కేబినెట్లోని మంత్రులు ఎలా వస్తారులేనని లోకేష్ సెటైర్ వేశారు. గతంలో మంత్రులు కేబినెట్ మీటింగుకు వచ్చినా అటెండెన్స్ రిజిస్టరులో సంతకం పెట్టి వెళ్ళడమే కదా అని లోకేష్ కామెంట్ చేశారు. సెక్రటేరియట్ నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా లేవని తెలిపారు ఉద్యోగులు. సెక్రటేరీయేట్ నిర్వహణ నిధులను వేరే అవసరాలకు మళ్లించి ఉంటారని లోకేష్ ఛలోక్తి విసిరారు.