నెల్లూరులో రొట్టెల పండుగ జరుగనుంది. ఇవాళ్టి నుంచే నెల్లూరులో రొట్టెల పండుగ కొనసాగనుంది. మతసామరస్యానికి ప్రతీకైన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు జరగనుంది. ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.

రాష్ట్ర పండుగ అయిన ఈ వేడుకకు లక్షలాది మంది ప్రజలు విపరీతంగా తరలివస్తారు. ఇక్కడికి చదువు బాగా రావాలని కోరుకుంటారు. ఆరోగ్యం బాగా లేని వారు ఇక్కడికి వచ్చి చెరువులో రొట్టెలను వదిలినట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం లేనివారు సైతం ఇక్కడికి వచ్చి ఉద్యోగం రావాలని మొక్కుకుంటారు.
ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. తొలి రోజు రాత్రి సందల్‌మాల్.. రేపు బారాషహిద్‌ల గంథ మహోత్సవం ఉంటుంది. దింతో భక్తులతో కళకళలాడుతోంది దర్గా ప్రాంగణం. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.